ఫార్ములా ఈ-రేస్‌ రద్దు.. దుర్మార్గమైన నిర్ణయం : కేటీఆర్‌

Jan 6,2024 12:00 #KTR

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఫార్ములా – ఈ రేస్‌ రద్దుపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ ట్విటర్‌(ఎక్స్‌) వేదికగా స్పందించారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయం అని విమర్శించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు సరికావని.. ఈ ప్రిక్స్‌ వంటి ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా మన బ్రాండ్‌ను పెంచుతాయని చెప్పారు. హైదరాబాద్‌ కేంద్రంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఫార్ములా – ఈ రేస్‌ను బిఆర్‌ఎస్‌ హయాంలో చక్కటి అవకాశంగా ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నారు. సస్టయినబుల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించినట్లు చెప్పారు.

➡️