విశాఖలో ఉత్సాహంగా కాన్సర్ వాక్

Feb 4,2024 10:11 #awareness rally, #Cancer, #Visakha
cancer rally

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బీచ్ రోడ్ లోని కాళీ మాతా గుడి వద్ద నుండి వైఎంసిఏ వరకు “క్లోజ్ ది కేర్ గ్యాప్” అనే థీమ్‌ తో “క్యాన్సర్ అవగాహన నడక” ను నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ వెన్న మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గడిచిన ఏడాది కాలంలో ఒక కోటి మంది ప్రజలు క్యాన్సర్ బారిన పని మృతి చెందారని ఇది 2030 సంవత్సరానికి ఏడాదికి కోటి 30 లక్షలు కు చేరనుందని అన్నారు. క్యాన్సర్ ను ప్రాథమిక దిశలోనే గుర్తిస్తే నివారించడం సులభం అవుతుందని క్యాన్సర్ నివారించేందుకు నేడు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రజలు ఈ క్యాన్సర్ రోగాన్ని సులభంగా జయిన్చావచ్చునని అన్నారు. 70% క్యాన్సర్ మరణాలు నివారణ, స్క్రీనింగ్, రోగనిర్ధారణ, చికిత్స అంశాల్లో అవగాహన వల్ల నివారించవచ్చునని అన్నరు. అదేవిధంగా మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో 9 నుండి 14 ఏళ్ల బాలికలకు క్యాన్సర్ వ్యాక్సిన్లు ఉచితంగా అందించడం అభినందనీయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్యాన్సర్ నివారణకు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ వాక్ లో సిఐఐ, గీతం డెంటల్ కాలేజీ, యంగ్ ఇండియన్, ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్(ఐ డబ్ల్యుఎన్), ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఎపిఎన్ఏ , ఏ ఎస్ హెచ్ ఏ, గాయత్రీ విద్య పరిషత్ మెడికల్ కాలేజ్, అనిల్ నీరుకొండ మెడికల్ కాలేజ్, రోటరీ క్లబ్ విశాఖ, వైజాగ్ ట్రైల్ రన్నర్స్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, ఏజ్ కేర్ ఫౌండేషన్ & శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ల నుండి సుమారు 2000 మంది సభ్యులు ఈ వాక్ లో పాల్గొన్నారు.

 

➡️