ఢిల్లీ మద్యం కుంభకోణంలో… కవితకు సిబిఐ నోటీసులు

Feb 22,2024 10:27 #CBI, #cid notice, #MLC Kavitha

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థ నుంచి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు మరోసారి పిలుపు అందింది. ఈనెల 26 (సోమవారం) తమ ముందు హాజరుకావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) సమన్లు జారీ చేసింది. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్‌ లోని ఆమె ఇంటి అడ్రస్‌ కు ఈ నోటీసులు అందినట్లు తెలిసింది. అలాగే మెయిల్‌ ద్వారా కూడా మరో సెట్‌ నోటీసులు అందించినట్లు సమాచారం. అయితే ఏ సెక్టన్‌ కింద కవితకు సిబిఐ నోటీసులు పంపిదనేది తెలియాల్సి ఉంది.కాగా 2022, జూలై తరువాత మద్యం కుంభకోణం బహిర్గతం కాగా… దాదాపు ఐదు నెలల తరువాత డిసెంబర్‌ లో తొలిసారి సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఇప్పుడు దాదాపు మరో ఏడాది తరువాత తాజా సమన్లు ఇచ్చింది. అయితే సిబిఐ, ఎన్‌ఫోర్సమెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సంస్థలు ఈ కుంభకోణం విచారణ చేస్తున్న సంగతి విదితమే.

➡️