రేపటి  నుంచి కేంద్ర బృందాలు పర్యటన

Jun 16,2024 22:59 #Central teams, #tour from tomorrow

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో రబీ కరువు పరిస్థితిని పరిశీలించి, అంచనా వేయడానికి రితేష్‌ చౌహాన్‌ నేతృత్వంలోని కేంద్ర బృందాలు కరువు ప్రభావిత జిల్లాల్లో ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు పర్యటించనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పది మంది సభ్యులు మూడు బృందాలుగా క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడి కరువు పరిస్థితిని విశ్లేషించనున్నారు. ఒకటో బృందం అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో, కర్నూలు, నంద్యాల జిల్లాలో రెండో బృందం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మూడో బృందం పర్యటించనున్నట్లు తెలిపారు.

➡️