చాగలమర్రి, రేణిగుంటలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

Apr 21,2024 18:46 #andrapradesh, #sun burning

ప్రజాశక్తి-అమరావతి: ఏపీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది. కాగా నంద్యాల జిల్లా చాగలమర్రి, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2 , కడప జిల్లా బలపనూరులో 43.8, అనకాపల్లి జిల్లా రావికమతంలో 43.8, పల్నాడు జిల్లా రావిపాడులో 43.8, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.7, పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 43.6, విజయనగరం జిల్లా ధర్మవరంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

➡️