టిడిపి కార్యకర్త శేషాద్రిపై దాడిని ఖండించిన చంద్రబాబు

May 25,2024 17:10 #chandrababu, #TDP

ప్రజాశక్తి-అమరావతి : చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పెద్దూరులో టిడిపి కార్యకర్త శేషాద్రిపై దాడి జరిగింది. ఈ ఘటనపై చంద్రబాబు స్పందించారు. తమ కార్యకర్త శేషాద్రిపై వైసిపి శ్రేణుల దాడిని ఖండిస్తున్నట్టు తెలిపారు. ఓటమి ఖాయమని తెలియడంతో విచక్షణ కోల్పోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అందుకే టిడిపి కార్యకర్తలపై వైసిపి శ్రేణులు, రౌడీలు దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

➡️