రోడ్డు ప్రమాదాలపై చంద్రబాబు దిగ్భ్రాంతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం కొంగవరం, కృష్ణా జిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాల్లో పది మంది మృతిచెందడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.

➡️