మోడీ తీరుపై చంద్రబాబు నాడు, నేడు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రంలో బిజెపితో పొత్తుపెట్టుకున్న తరువాత టిడిపి అధినేత చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఉగ్రవాది, భార్యను చూసుకోలేనివాడని ఎత్తిపోసిన నోటితోనే ప్రధాని మోడీ అంటే సంస్కర్త అంటూ చంద్రబాబు మాట మార్చారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకుంటూనే కనీస గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రజాగళర సభలో పొగడ్తల వర్షం కురిపించారు. 2018లో ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగానూ, బహిరంగ ప్రదేశాల్లోనూ మోడీకి వ్యతిరేకంగా అనేక ప్రకటనలు చేశారు.
మోడీపై నాడు :
‘కనీసం దండం పెడితే నమస్కారం కూడా చేయని సంస్కారం ఈ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు. కుటుంబాన్నే చూసుకోలేనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు. ప్రధాన మంత్రి నేనేదో వాచ్‌మెన్‌ అంటాడు.. ఈయనేదో వాచ్‌మెన్‌ కాదు దగా కోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడగట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపి లేదు. మనతో పొత్తుపెట్టుకున్నాకే గెలిచారు. వాళ్లతో పొత్తుపెట్టుకోకపోతే మరో 5 సీట్లు ఎక్కువ వచ్చేవి మనకు.
మోడీపై నేడు :
మోడీ అంటే సంక్షేమం.. మోడీ అంటే అభివృద్ధి.. మోడీ అంటే సంస్కరణం.. మోడీ అంటే భవిష్యత్తు.. మోడీ అంటే ఆత్మగౌరవం.. ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు నరేంద్ర మోడీ గారు.

➡️