రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసింది : చంద్రబాబు

Jun 8,2024 08:10 #chandrababu, #death, #Ramoji Rao

అమరావతి : ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణవార్త తనను కలచివేసిందని టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన రామోజీరావు కీర్తి అజరామరం అని చెప్పారు. ఈనాడు గ్రూప్‌ సంస్థల స్థాపనతో రామోజీరావు వేలమందికి ఉపాధి కల్పించారన్నారు. మీడియా రంగంలో ఆయనది ప్రత్యేకమైన శకం అని కొనియాడారు. రామోజీరావుతో తనకున్న 4 దశాబ్దాల అనుబంధాన్ని చంద్రబాబు స్మరించుకున్నారు.

➡️