లబ్ది అందని అర్హుల ఖాతాల్లో నగదును జమ చేసిన సిఎం జగన్‌

తాడేపల్లి : అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందనివారికి మరో అవకాశమిస్తూ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి 68,990 మంది అర్హులకు రూ.97.76 కోట్లను బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేశారు. గత ఆగస్టు 2023 నుండి డిసెంబర్‌ 2023 వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందనివారికి నిధులను సిఎం జమ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ … లబ్ధిదారులెవ్వరూ సంక్షేమ పథకాలు మిస్‌ కాకూడదన్నారు. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో లబ్ది అందనివారికి నగదు జమ చేస్తున్నామని తెలిపారు. 68,990 మందికి రూ. 97.76 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ప్రతి 6 నెలలకోసారి ఈ నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని తెలిపారు. గత 55 నెలల్లో డీబీటీ ద్వారా రూ. 2,46,551 కోట్లు అందించామన్నారు. వలంటీర్లు స్వయంగా వెళ్లి లబ్ధిదారులతో దరఖాస్తులు పెట్టించాలని సిఎం ఆదేశించారు.

➡️