cm jagan: అనకాపల్లి చేరుకున్న సీఎం జగన్‌

ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నుంచి విశాఖపట్నం బయల్దేరిన సీఎం జగన్‌ అక్కడి నుంచి అనకాపల్లి చేరుకున్నారు. అనకాపల్లి జిల్లా పిసినికాడలో జరుగనున్న సభలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి వైఎస్సార్‌ చేయూత పథకంలో భాగంగా 4వ విడుత నిధులను విడుదల చేయనున్నారు. వైఎస్సార్‌ చేయూత కింద అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇస్తున్నారు. నాలుగో విడతగా అందించే మొత్తంతో ఒక్కొక్క మహిళకు రూ.75 వేల సాయం అందనుంది.

➡️