రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Mar 4,2024 11:40 #ap cm jagan, #visaka tour

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌లో జరిగే విజన్‌ విశాఖ సదస్సులో వివిధ రంగాల వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం పీఎంపాలెంలోని వైజాగ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఉపాధి, సీడాప్‌ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు.

➡️