అభయ హస్తం దరఖాస్తుల అమ్మకాలపై సిఎం రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

తెలంగాణ : అభయ హస్తం దరఖాస్తుల అమ్మకాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం సిఎం రేవంత్‌ రెడ్డి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందేనన్నారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దన్నారు. పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

➡️