రాజీవ్‌ రతన్‌ మృతిపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌ : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ మృతిపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్‌ రతన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుదీర్ఘ కాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన అందించిన విశిష్టమైన సేవలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సమర్ధవంతంగా పని చేసిన అధికారులను తెలంగాణ సమాజం మరిచిపోదన్నారు.

➡️