రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశం

హైదరాబాద్‌ : మెట్రో విస్తరణ పనులు, అలైన్‌మెంట్‌కు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై అధికారులను ఆరా తీసిన సీఎం.. ఓఆర్‌ఆర్‌ వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో ఎలైన్‌మెంట్‌ రూపొందించడంపై ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ఓఆర్‌ఆర్‌ ఉన్నందున రాయదుర్గం – శంషాబాద్‌ విమానాశ్రయం పనుల టెండర్లను నిలిపివేయాలని ఆదేశించారు. ఇందుకు బదులుగా రెండు ప్రత్యామ్నాయాలను సూచించారు. చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, జల్‌పల్లి, విమానాశ్రయం రూట్‌తో పాటూ చాంద్రాయణగుట్ట, బార్కాస్‌, పహాడీషరీఫ్‌, శ్రీశైలం మార్గాన్ని అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఇందులో ఏది ఖర్చు తక్కువైతే దానికి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు తెలిపారు.

➡️