కూలిన చర్చి స్లాబ్‌.. నలుగురు మృతి

Jan 7,2024 14:26 #hyderabad

సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా కోహీర్‌లోని నిర్మాణంలో ఉన్న చర్చి కూలింది. స్లాబ్‌ వేస్తుండగా ప్రమాదవశాత్తు సెంట్రింగ్‌ మెటీరియల్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.  విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక కార్యక్రమాలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు వారంతా శ్రమిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

 

➡️