పిఠాపురంలో రైల్వే ప్రయాణికుల ఆందోళన

Dec 14,2023 10:43 #passengers, #Protest
  • పట్టాలపై నిరసనతో నిలిచిన రైలు

ప్రజాశక్తి-  పిఠాపురం (కాకినాడ జిల్లా) : అయ్యప్పస్వామి మాలధారులు, ప్రయాణికులకు మధ్య జరిగిన వివాదంలో పిఠాపురంలో ఉద్రికత్తత నెలకొంది. రిజర్వేషన్‌ బోగీల్లో సైతం సాధారణ ప్రయాణికులు ఎక్కడంతో ఈ వివాదం నెలకొంది. సాధారణ ప్రయాణికుల ఎక్కడంతో అయ్యప్ప స్వామి భక్తులంతా ఏకమై వారిని కిందకి తోసేశారు. దీంతో వారంతా ఆందోళనకు దిగారు. రైలు ఇంజన్‌ ముందు ట్రాక్‌పై బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పలువురిని రైలు ఎక్కించే ప్రయత్నం చేశారు. ట్రైన్‌ అద్వానంగా మారుస్తున్నారని తమకు రిజర్వేషన్‌ ఉందని రిజర్వేషన్‌ లేని వాళ్ళని ఎలా ఎక్కిస్తారని అయ్యప్ప స్వాములు పోలీసులను ప్రశ్నిం చారు. పోలీసులు వారిక సర్ధి చెప్పి కొంత మందిని రైలు ఎక్కించారు. మిగిలిన వారిని ఇతర రైళ్లలో పంపించారు. సాధారణ భోగిల సంఖ్యను తగ్గించడంతో రైలులు అన్ని కిక్కిరిసి ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సాధారణ బోగీల  సంఖ్యను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

➡️