కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నా : చంద్రబాబు

Mar 26,2024 15:36 #Chandrababu Naidu, #Kakinada, #TDP

ప్రజాశక్తి-తిరుపతి : కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అర్చకులను కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య అని మండిపడ్డారు. ‘అర్చకుడంటే దేవుడు, భక్తుడికి మధ్య అనుసంధాన కర్తగా భావిస్తాం. వారి కాళ్లకు మొక్కే సంప్రదాయం మనది. వైసీపీ నేతల మదానికి ఇది నిదర్శనం’ అని ఫైర్‌ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక వరుసగా విగ్రహాలపై దాడులు జరిగాయని.. ఒక్క కేసులోనూ నిందితులపై చర్యలు లేవన్నారు. ఇప్పుడు ఏకంగా గుడిలోని అర్చకులపైనే దాడిచేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. నిందితుడిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

➡️