కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల

  • టెక్కలి బరిలో కిల్లి కృపారాణి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయనున్న అభ్యర్ధుల రెండో జాబితా విడుదలైంది. ఆరు లోక్‌సభ, 12 శాసన సభ స్థానాలకు అభ్యర్ధులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల వైసిపి నుంచి పార్టీలో చేరిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణిని టెక్కలి శాసన సభ నియోజకవర్గ అభ్యర్ధిగా అదేవిధంగా పూతలపట్టు శాసనసభ అభ్యర్ధిగా ఇటీవల చేరిన ఎంఎస్‌ బాబును ప్రకటించారు.
లోక్‌సభ అభ్యర్ధులు
నియోజకవర్గం         అభ్యర్ధి పేరు
విశాఖపట్నం            సత్యనారాయణరెడ్డి
అనకాపల్లి                 వేగి వెంకటేష్‌
ఏలూరు                    కావూరి లావణ్య
నరాసరావుపేట         గర్నేపూడి అలెగ్జాండర్‌ సుధాకర్‌
నెల్లూరు                    కొప్పుల రాజు
తిరుపతి(ఎస్సి)          చింతా మోహన్‌

శాసన సభ అభ్యర్ధులు
నియోజకవర్గం                   అభ్యర్ధి పేరు
టెక్కలి కిల్లి                         కృపారాణి
భీమిలి                               అడ్డాల వెంకట వర్మ రాజు
విశాఖపట్నం సౌత్‌              వాసుపల్లి సంతోష్‌
గాజువాక                            లక్కరాజు రామారావు
అరకు వ్యాలీ(ఎస్టి)              శెట్టి గంగాధరస్వామి
నర్సీపట్నం                       రూతులశ్రీరామమూర్తి
గోపాలపురం(ఎస్సి)           ఎస్‌ మార్టిన్‌లూథర్‌
ఎర్రగొండపాలెం(ఎస్సి)       బి అజిత్‌ రావు
పర్చూరు                          నల్లగొర్ల శివశ్రీలక్ష్మీ జ్యోతి
సంతనూతలపాడు(ఎస్సి)  పాలపర్తి విజేష్‌రాజ్‌
గంగాధర నెల్లూరు(ఎస్సి)    డి రమేష్‌ బాబు
పూతలపట్టు                      ఎంఎస్‌ బాబు

కాంగ్రెస్‌ కార్యాలయంలో ఉగాది వేడుకలు
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రకార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఉగాది వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు నరహరశెట్టి నరసింహారావు, వి గురునాధం, ప్రధాన కార్యదర్శులు పివై కిరణ్‌, కుర్షీద, లీగల్‌ సెల్‌ చైర్మన్‌ జంధ్యాల శాస్త్రీ తదితరులు పాల్గొన్నారు.

➡️