వలంటీర్ల వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర

– మూడో తేదీకల్లా పెన్షన్లు అందిస్తాం
– సజ్జల రామకృష్ణారెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చంద్రబాబు మొదటి నుంచి చేస్తున్న కుట్రలు ఎన్నికల కమిషన్‌ ప్రకటనతో బహిర్గతం అయ్యాయని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అందరికీ మూడో తేదీకల్లా పెన్షన్లు అందిస్తామని తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు మేలు జరగడం చంద్రబాబుకు ఇష్టం వుండదని విమర్శించారు. సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ పేరుతో నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కేవలం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు తన కుట్రలను కప్పిపుచ్చుకునేందుకు నష్ట నివారణలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని లేఖ రాశారని అన్నారు. పవన్‌కల్యాణ్‌ను చంద్రబాబు మింగేస్తాడని ముందు నుంచి తాము చెబుతున్నట్లే జరుగుతోందన్నారు. జనసేనకు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులనే పెట్టుకున్నారన్నారు.

➡️