పంటకాలంలో కరువు బృందం పర్యటనలా? : సిపిఐ రామకృష్ణ

Jun 21,2024 00:29 #cpi ramakrishna

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పంటవేసే కాలంలో, వర్షాలు కురిసే నేపధ్యంలో రాష్ట్రంలో కరువు తీవ్రతపై కేంద్రబృందం పర్యటించడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పదేళ్లుగా రైతుల పట్ల శీతకన్ను వేసిందని గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. గత సీజన్‌లో దాదాపు 87 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నివేదించిందని తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్లు వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువొచ్చింది ఎప్పుడు? పంట నష్టం జరిగింది ఎప్పుడు? అని ప్రశ్నించారు. ఇప్పుడు కేంద్ర బృందం వచ్చి పంట నష్టాన్ని ఎలా అంచనా వేస్తారని ప్రశ్నించారు.

➡️