అంగన్వాడీల నిర్భంధాన్ని ఖండించిన సిపిఎం రాష్ట్ర కమిటీ

cpm on anganwaadi arrest

ప్రజాశక్తి-విజయవాడ : వేలాది మంది అంగన్వాడీ వర్కర్లను, ఆయాలను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని సీపీఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఓ వీడియోని విడుదల చేశారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే అరెస్టులు చేయడం గర్హనీయమందని తెలిపారు. 5వ తేదీ లోగా డ్యూటీ లోగా చేరకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దుర్మార్గంమన్నారు.  వారి న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

➡️