దారి దీపం గురజాడ : ఎల్‌.బి.శ్రీరాం

Dec 11,2023 15:13 #Gurajada Apparao, #LB Sriram
  • గురజాడ అప్పారావు స్వగృహాన్ని సందర్శించిన ఎల్‌.బి.శ్రీరాం

ప్రజాశక్తి-విజయనగరంకోట : గురజాడ అప్పారావు ఎందరికో దారి దీపం (లైట్‌ హౌస్‌)అని ప్రముఖ రంగస్థల, సినీ రచయిత, నటులు ఎల్‌.బి.శ్రీరాం కొనియాడారు. నవ సాహితీ సంస్థ ఇస్తున్న అవార్డు అందుకోవడం కోసం ఎల్‌.బి.శ్రీరాం విశాఖపట్నం రావడం జరిగింది. ముందుగా ఆయన గురజాడ అప్పారావు స్వగృహాన్ని సందర్శించి ఆయన తిరిగాడిన ప్రదేశాన్ని, రచనలు, వాడిన వస్తువులను చూసి పులకించి పోయారు. సాంస్కృతిక సభ్యులు గురజాడ వారసులు ముందుగా దుసాలువా కప్పి సన్మానించి గురజాడ రచించిన కన్యాశుల్కం పుస్తకం ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”ఈ పుస్తకం అందుకోవడం కోటి రూపాయలు కంటే ఎక్కువ అని అన్నారు. కన్యాశుల్కం నాటకం సృష్టి కర్త మహనీయుడు గురజాడ అప్పారావు స్వగృహాన్ని సందర్శించడానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన పరిచిన బాటలోనే అందరూ నడుస్తున్నారన్నారు. ఆయన ఫందా నాకు అబ్బి, జనరంజకంగా సినిమాల్లో రాయడం జరుగుతుందన్నారు. అందువలనే 40మంది కమీడియన్స్‌లో నేను ఒక్కరిని కాగలిగానన్నారు. ఆయన విలువలు, సాంప్రదాయాలు పునుకుపుచ్చుకున్న వారిలో నేను ఒకరని అన్నారు. జేబీ రమణమూర్తి కన్యాశుల్కాన్ని ఎక్కువసార్లు ప్రదర్శించడం జరిగిందన్నారు. ఆయనపై త్వరలోనే ఒక లఘు చిత్రాన్ని ఇక్కడికి వచ్చి చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ మహనీయుడు ప్రభావంతో ఎంతో మంది కవులు రచయితలు ముందుకు సాగుతున్నారని తెలిపారు. నేటి సినీ రంగంలో కొత్తదనాన్ని తీసుకురావాలి దానితోపాటు పాతను తీసుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు ఉష్‌ కాకి అప్పారావు, తిరుపతి నాయుడు , గురుజాడ సాంస్కృతిక సమైక్య కార్యదర్శి కాపుగంటి ప్రకాష్‌, గురజాడ వారుసులు వెంకట ప్రసాద్‌, ఇందిరా, సాంస్కృతిక సమైక్య సభ్యులు సూర్యలక్ష్మి, ఈపు విజరు కుమార్‌, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

➡️