దస్తగిరి పిటిషన్‌ రీ ఓపెన్‌

Apr 8,2024 23:25
  •  సిబిఐ కోర్టులో 12న విచారణ

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : వివేకా హత్య కేసు విచారణలో తనను సాక్షిగా పరిగణించా లంటూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ కోర్టు సోమవారం రీ ఓపెన్‌ చేసింది. సిబిఐ వాదనలు వినేందుకు మళ్లీ విచారణ జరపాలని నిర్ణయించింది. దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌ప గతంలో సిబిఐ వాదనలు వినిపించలేదు. దీంతో దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్‌పై గత నెల 12నే న్యాయస్థానం విచారణ ముగిస్తూ తీర్పును ఏప్రిల్‌ ఎనిమిదికి వాయిదా వేసింది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత సిబిఐ కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు ప్రకటించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి సాక్ష్యం నమోదు చేయాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను సిబిఐ కోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది.

➡️