3వ రోజు : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’

విజయవాడ : ‘సిపిఎం జన శంఖారావం పాదయాత్ర’ మూడో రోజు శనివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు నేతృత్వంలో కొనసాగుతోన్న ఈ పాదయాత్ర ఈరోజు ప్రకాష్‌నగర్‌, పైపులరోడ్డు మీదుగా సాగింది. ” దేశాన్ని ముంచిన రాష్ట్రాన్ని వంచించిన బిజెపి-వైసిపిలను గద్దె దించండి.. నిరంకుశ బిజెపితో జతకడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించండి.. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం, వామపక్షాలను బలపరచండి..” నినాదంతో వారం రోజులపాటు విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో సిపిఎం ‘జన శంఖారావం’ పాదయాత్ర కొనసాగనుంది.

 

 

 

 

➡️