నేడు మేడిగడ్డ మరమ్మతులపై నిర్ణయం

May 18,2024 10:50 #hyderabad, #medigadda tour

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల మరమ్మతుల విషయంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను నీటిపారుదల శాఖ సిద్ధం చేసింది. వానాకాలం వచ్చేలోగా ఈ మూడు బ్యారేజీల పరిరక్షణ చర్యలు చేపట్టాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచించిన విషయం తెలిసిందే.

➡️