శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న నీటి ప్రవాహం

Jun 21,2024 00:16 #project, #srisailam

ప్రజాశక్తి- శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం తుంగభద్ర నుండి నీటి ప్రవాహం తగ్గుముఖం పెట్టింది. గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 449 క్యూసెక్కుల నీరు మాత్రమే జలాశయానికి చేరుతున్నాయి. అదే సమయానికి జలాశయం నీటిమట్టం 814.70 అడుగులకు చేరింది. నీటి నిలువ 37.1936 టీఎంసీలుగా ఉంది. అలాగే శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుండి మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 286 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

➡️