మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోదరుడు చంద్రశేఖర్ ఈ రోజు కన్నుమూశారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయన మృతితో అటు దేవినేని ఉమా ఇంట్లో, విషాద చాయలు అలుముకున్నాయి. కాగా చంద్రశేఖర్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా వారి స్వగ్రామం అయిన కంచికచర్లకు తరలించనున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

➡️