గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు.. గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు

Jan 31,2024 10:47 #Dense Fog, #gannavaram airport

ప్రజాశక్తి-గన్నవరం: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్,చెన్నైల నుంచి బయలుదేరిన ఇండిగో విమానాలు గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కావాల్సి ఉంది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. 8 రౌండ్లు చక్కర్లు కొట్టిన తర్వాత సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
కాగా, నిన్న హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌ సమయంలో ప్రయాణికులు భయాందోళనకు గురైన ఘటన మంగళవారం జరిగింది. ఇండిగో సంస్థకు చెందిన ఏటీఆర్‌ 72–600 విమానం హైదరాబాద్‌ నుంచి ప్రయాణికులతో ఉదయం 11 గంటలకు ఇక్కడికి చేరుకుంది. రన్‌ వేపై దిగేందుకు దగ్గరగా వచ్చిన సమయంలో పైలెట్లు ఒక్కసారిగా విమానాన్ని తిరిగి గాల్లోకి లేపడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.ఐదు నిమిషాల వ్యవధిలో విమానాన్ని తిరిగి సురక్షితంగా రన్‌వేపై ల్యాండింగ్‌ చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

➡️