లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌

హైదరాబాద్‌ : రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టణ ప్రణాళిక విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తికి భవన నిర్మాణ అనుతి కోసం టౌన్‌ ప్లానింగ్‌ డిప్యూటీ డైరెక్ట్‌ర్‌ జగన్మోహన్‌ లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో చేసేదేమి లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు జగన్మోహన్‌కు లంచం ఇస్తుండగా రెడ్‌ హ్యౌండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️