దుర్గమ్మను దర్శించుకున్న డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా

ప్రజాశక్తి, వన్‌టౌన్‌ (ఎన్‌టిఆర్‌ జిల్లా) :విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను గురువారం రాష్ట్ర డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాలను ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్‌.రామారావు అందజేశారు.

➡️