daiyeria – తూర్పుపిన్నిబోయినవారిపాలెం గ్రామస్తులకు అస్వస్థత

– కలుషిత ఆహారం తిన్నడం వల్లే ఇబ్బందులు : వైద్యులు
ప్రజాశక్తి – బాపట్ల :బాపట్ల మండలం తూర్పుపిన్నిబోయినవారిపాలెం గ్రామస్తులు రెండురోజులుగా వాంతులు, విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఓ వృద్ధురాలి పరిస్థితి విషమంగా మారడంతో బాపట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. మరొకరు గుంటూరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం ఏడుగురు కోలుకున్నారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే విరోచనాలు, వాంతులతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వైద్యశాఖ అధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పరీక్షలు చేసి.. అవసరమైన వారికి మందులు అందజేశారు. తాగునీరు, ఆహార నమూనాలను గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా పరీక్షకు పంపినట్లు ఇఒపిఆర్‌డి పులి శరత్‌బాబు తెలిపారు. పరీక్ష అనంతరం నీటిలో ఎటువంటి సమస్య లేదని తేలిందని అధికారులు తెలిపారు.

➡️