చిత్తూరులో 33మంది వాలంటీర్లు తొలగింపు

అమరావతి : చిత్తూరు జిల్లాలో ఏకంగా 33 మంది వాలంటీర్లపై అధికార వేటుపడింది. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగా … వాలంటీర్లలో చిత్తూరు కార్పొరేషన్‌ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురిపై వేటుపడింది. వీరిని వాలంటీర్లుగా తొలగించినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు వాలంటీర్లను తొలగించడంపై టిడిపి, ఇతర విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపికి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

➡️