94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి : శశి భూషణ్‌కుమార్‌

Apr 6,2024 00:24 #AAP Government, #Pension

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నాటికి సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ 94 శాతం లబ్ధిదారులకు అందజేశామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించి రూ.1,847.52 కోట్లు నగదును పింఛనుదారులకు అందజేశామన్నారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి పింఛనుదారులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు పింఛన్ల పంపిణీ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలన్నారు.

➡️