కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ ప్రారంభం

Jan 6,2024 08:39 #hyderabad, #new rice card

హైదరాబాద్‌ : రాష్ట్రంలో 1,11,321 మందికి కొత్తగా రేషన్‌ కార్డుల పంపిణీని ఏపీ సీఎం జగన్‌ ప్రారంభించారు. 2023 ఆగస్టు-డిసెంబర్‌ వరకు అర్హులై.. పొందని వారిని తాజాగా అర్హుల జాబితాలో చేర్చి కార్డులు అందించారు. అలాగే 1.17 లక్షల మందికి కొత్త పెన్షన్లు, 6,314 మందికి హెల్త్‌ కార్డులు, 34వేల మందికి ఇళ్ల పట్టాలనూ ప్రభుత్వం అందించింది. 55 నెలల్లోనే డిబిటి 2.46లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం వెల్లడించింది.

➡️