శ్రీశైలంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించిన జిల్లా ఎస్పీ

శ్రీశైలం: శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఉగాది బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి రథ మహోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం ఒక్కసారిగా యాత్రికులు తిరుగు ప్రయాణం కావడంతో ట్రాఫిక్‌ అంతరాయం కలగకుండా ఉండేందుకు కర్ణాటక బస్టాండ్‌ ఏరియా, నంది సర్కిల్‌, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, మరి ముఖ్యంగా రోడ్డు ఎగ్జిట్‌ పాయింట్‌ వద్ద గల ట్రాఫిక్‌ పాయింట్ల ఉన్న అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం అయ్యారు.
నంది సర్కిల్‌ ఎగ్జిట్‌ పాయింట్‌ వద్ద నుంచి రామయ్య టర్నింగ్‌, సాక్షి గణపతి, అటకేశ్వరం, ముఖ ద్వారం, శిఖరం వరకు ట్రాఫిక్‌ పాయింట్లలోని అధికారులతో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వాహనాలకు ఎక్కడ అంతరాయం కలగకుండా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. అలాగే నంది సర్కిల్‌ టోల్‌గేట్‌ వద్ద గల బయటకు వెళ్లే మార్గం వద్ద ట్రాఫిక్‌ క్రమబద్దీకరణను స్వయంగా పర్యవేక్షించారు.

➡️