యశోద ఆస్పత్రికి రాకండి.. ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత విజ్ఞప్తి..

Dec 12,2023 17:36 #KCR, #Yashoda Hospital

హైదరాబాద్‌: తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని.. అప్పడివరకు సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్‌ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని కేసీఆర్‌ ప్రజలను వేడుకున్నారు.తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కఅతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి మొక్కారు. తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు.. హాస్పిటల్‌ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టద్దని పదే పదే వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేసారు.

➡️