ఫోన్‌ ట్యాపింగ్‌ పై వారు సిబిఐ విచారణ కోరరా ? : రేవంత్‌ రెడ్డి

తెలంగాణ : అన్నింటికీ సిబిఐ అనే కెటిఆర్‌, హరీశ్‌.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై మాత్రం సిబిఐ విచారణ కోరరా ? అని సిఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలోని మీడియాతో ఆయన చిట్‌చాట్‌లో మాట్లాడారు. అధికారం మారాక జరిగిన బదిలీల్లో కొన్ని వస్తువులు మాయం అయ్యాయన్నారు. ఎవరు బాధ్యులో తేల్చే క్రమంలో ట్యాపింగ్‌ అంశం బయటకు వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ జరపదు అని చెప్పారు. తీవ్రవాదులు, జాతి వ్యతిరేక శక్తుల ఫోన్లు ట్యాప్‌ చేయవచ్చునని రేవంత్‌ రెడ్డి అన్నారు.

➡️