ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ ముఠా అరెస్ట్‌

Dec 31,2023 12:28 #arest, #drug gangs, #hyderabad

హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. న్యూ ఇయర్‌ వేడుకల్లో విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నాలు చేస్తుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకున్నారు. రాజస్థాన్‌ నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు గుర్తించారు. నిందితుల నుంచి 15 గ్రాముల హెరాయిన్‌, రూ.10వేలు, ఒక బైక్‌, 3 మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

➡️