హైదరాబాద్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌.. ముగ్గురు అరెస్ట్‌

Dec 28,2023 13:25 #drug gangs, #hyderabad

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు అంతర్‌ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి 100 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. న్యూఇయర్‌ వేడుకలకు గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. డ్రగ్స్‌ పట్టుబడిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

➡️