E-Cet: 26 నుంచి ఇ-సెట్‌ కౌన్సెలింగు

Jun 25,2024 00:02 #accets

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో ఇ-సెట్‌ ఇంజినీరింగ్‌ అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ జూన్‌ 26 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అడ్మిషన్ల కన్వీనరు నవ్య సోమవారం విడుదల చేశారు.
ప్రోసెసింగ్‌ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్‌ జూన్‌ 26 నుంచి 30వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం ఉంది. సర్టిఫికెట్ల అప్‌లోడ్‌ 27 నుంచి జులై 3వ తేదీ వరకు ఉంటుంది. జులై 1 నుంచి 4వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు, 5 నుంచి ఆప్షన్ల మార్పు చేసుకునే అవకాశం ఉంది. సీట్ల కేటాయింపు జులై 8న ఉంటుంది. జులై 9 నుంచి 15 వరకు విద్యార్థులు కళాశాలల్లో రిపోర్టు చేయాలి. జులై 10 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. వ్యవసాయ డిప్లమో అభ్యర్థులకు తదుపరి దశ కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీ ఉంటుంది. ఫార్మసీ అభ్యర్థులకు ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేస్తామని కన్వీనరు నవ్య వివరించారు.

➡️