త్వరలో ఇఎపిసెట్‌ ఫలితాలు

Jun 9,2024 21:20 #EAPSET, #results soon
  • ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మా, అగ్రికల్చర్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎపి ఇఎపిసెట్‌)-2024 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఈ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ముగిసింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం లేకపోవడంతో ఈ ఫలితాలు నిలిచాయి. ప్రభుత్వ అనుమతి కోసం ఉన్నత విద్యామండలి, సెట్‌ కన్వీనర్‌ ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా, 3,39,139 (93.47 శాతం) మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగానికి 2,74,213 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,58,373 (94.22 శాతం) మంది హాజరయ్యారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగానికి 88,638 మంది దరఖాస్తు చేసుకోగా, 80,766 (91.12 శాతం) హాజరయ్యారు. పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ముగిసిందని ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామంటున్నారు.

➡️