సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

సింగరేణి : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ బుధవారం ప్రారంభమైంది. 11 డివిజన్‌లలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా.. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఓట్ల లెక్కింపు ఇదే రోజు (బుధవారం) రాత్రి చేపట్టనున్నారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్రాలకు బ్యాలెట్‌ పెట్టెలను తరలించనున్నారు. రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి, పూర్తి అయిన తర్వాతే ఫలితాలు ప్రకటిస్తామని సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు తెలిపారు.

➡️