ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం : మంత్రి అమర్‌నాథ్‌

Feb 15,2024 09:16 #YCP Minister
Encouraging aspiring entrepreneurs: Minister Amarnath

అమరావతి బ్యూరో: రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సుమారు రూ.4 వేల 178 కోట్లతో ఏర్పాటు చేస్తున్న బిర్లా గ్రూప్‌, రిలయన్స్‌ ఎనర్జీ, హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్‌ ఇండియా లిమిటెడ్‌, ఎపిఐఐసి, ఎపి ఎంఎస్‌ఎంఇఒ కార్పొరేషన్‌లకు సంబంధించిన 8 ప్రాజెక్టులను సచివాలయం నుంచి బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎంపిఎంఎస్‌ఎంఇ వన్‌ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్లలో దేశంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. సుమారు రూ.20 వేలకోట్లతో నాలుగు ప్రధాన పోర్టులు నిర్మించేందుకు సిద్ధం చేశామన్నారు. రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. 10 ఫిషింగ్‌ హార్బర్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 26 జిల్లాల్లో 50కు పైగా పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమలశాఖ కార్యదర్శి యువరాజ్‌, ఎపిఐఐసి ఎమ్‌డి ప్రవీణ్‌కుమార్‌, పరిశ్రమలశాఖ కమిషనరు సిహెచ్‌ రాజేశ్వరరెడ్డి, సిఇఒ ఎపి ఎంఎస్‌ఎంఇ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సేదు మాధవన్‌ పాల్గొన్నారు. చిరస్మరణీయ నేత సంజీవయ్య : పవన్‌కల్యాణ్‌ అమరావతి బ్యూరో : ప్రతిఒక్కరూ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గురించి తెలుసుకోవాలని, చరిత్రలో ఆయన చిరస్మరణీయ నాయకుడని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. బుధవారం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆయన అంజలి ఘటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పేదలకు భూములు పంపిణీ, వృద్ధాప్య పింఛన్లు, కార్మికులకు బోనస్‌ వంటివి ప్రవేశపెట్టి పేదల పక్షపాతిగా నిలిచారని పవన్‌ కొనియాడారు. వైసిపి రాజ్యసభ అభ్యర్థుల రెండో సెట్‌ నామినేషన్లుశ్రీ టిడిపి బరిలో లేకపోవడంతో ఏకగ్రీవమయ్యే అవకాశంప్రజాశక్తి-అమరావతి బ్యూరోవైసిపి అభ్యర్థులు ముగ్గురు మరోసెట్‌ నామినేషన్లు బుధవారం దాఖలు చేశారు. రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు ఏకగ్రీవం దిశగా సాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం పార్టీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో రాజ్యసభకు పోటీ పెట్టడం లేదని ప్రకటించడంతో వైసిపి తరపున నామినేషన్‌ వేసిన వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబూరావు ఏకగ్రీవం అయ్యే అవకాశం వుంది. నామినేషన్ల దాఖలుకు గురువారమే చివరిరోజు. గడువు ముగిశాక వైసిపికి చెందిన ముగ్గురి అభ్యర్థుల నామినేషన్ల స్క్రూటిని తర్వాత ఏకగ్రీవమైనట్లు ప్రకటించే అవకాశం వుంది.

➡️