ఎన్యూమరేషన్‌ నిర్వహించడం లేదు – ప్రజాశక్తి వార్తకు స్పందన

ప్రజాశక్తి-సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) :సముద్ర వేట నిషేధ సమయంలో ఎన్యూమరేషన్‌కు సంబంధించి ‘పంచాయతీ సెక్రటరీ, వలంటీర్లతో ఎన్యూమరేషన్‌ చేయాలి’ అంటూ ప్రకాశం జిల్లా మత్స్యశాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులలో తప్పుగా పడిందని, దానిని సరిదిద్ది తర్వాత మళ్లీ ఉత్తర్వులిచ్చామని జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.చంద్రశేఖర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘వలంటీర్లతో ఎన్యూమరేషనా..?’ శీర్షికన మంగళవారం ప్రజాశక్తి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు జిల్లా మత్స్యశాఖ అధికారి స్పందించారు. ఇది కేవలం టైపింగులో వచ్చిన పొరపాటు వల్ల అలా జరిగిందని వెల్లడించారు. మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి ఎన్యూమరేషన్‌ నిర్వహించడం లేదని పేర్కొన్నారు.

➡️