చర్లపల్లి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో పేలుడు..

Jan 3,2024 11:36 #hyderabad

హైదరాబాద్‌: చర్లపల్లిలోని మధుసూదన్‌రెడ్డి నగర్‌లో భారీ పేలుడు సంభవించింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్‌ హౌల్‌ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నుంచి రెండు రోజులుగా కెమికల్‌ దుర్వాసన వస్తుంది అని కాలనీ వాసులు వాపోతున్నారు. దీని వల్ల కాలనీలో మొత్తం కెమికల్‌ వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

➡️