అగ్రిల్యాబ్‌లతో తీరనున్న రైతుల కష్టాలు

Feb 22,2024 11:45 #agri labs

 చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు

ప్రజాశక్తి – నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లతో రైతుల కష్టాలు తీరనున్నాయని చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. అన్నదాతలు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని అగ్రికల్చర్‌ మార్కెట్‌ యార్డు ఆవరణలో రూ.1.22 లక్షలు నాబార్డు నిధులతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌ను ముదునూరి ప్రసాదరాజు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం ఇన్‌పుట్స్‌ బారిన పడకుండా ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. విత్తనాలే కాకుండా ఎరువులు, పురుగుమందులు, చేపలు, రొయ్యల చెరువులకు సంబంధించిన అన్ని రకాల టెస్టులను రైతులు ఉచితంగా పొందవచ్చన్నారు. దీనిద్వారా భూసార పరీక్షలు కూడా ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఈ ల్యాబ్‌లను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బర్రె శ్రీవెంకటరమణ, జెడ్‌పిటిసిలు బొక్కా రాధాకృష్ణ, తిరుమాని బాపూజీ, ఎంపిపి మైలాబత్తుల సోనీ, వైస్‌ ఎంపిపి ఉంగరాల రమేష్‌నాయుడు, ఆత్మ కమిటీ ఛైర్మన్‌ కడలి రాంబాబు, ఎంపిటిసి దాయం వెంకట్రావు, పోలీస్‌ గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్‌ పోలిశెట్టి గోపీనాథ్‌, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్‌వివిఎస్‌.ప్రసాద్‌, వ్యవసాయశాఖ ఎడి ఈదా అనిల్‌కుమారి, ఎఒలు రాజశేఖర్‌, అబ్దుల్‌ రహీం, ఎఫ్‌డిఒలు ఏడుకొండలు, కొల్లాటి భారతి పాల్గొన్నారు.

➡️