CPM – జగ్గయ్యపేట డయేరియా ప్రాంతాల్లో సిపిఎం బృందం పర్యటన

జగ్గయ్యపేట (విజయవాడ) : జగ్గయ్యపేట నియోజకవర్గంలోని డయేరియా ప్రాంత మండలాల్లో శుక్రవారం సిపిఎం రాష్ట్ర, జిల్లా నేతలు పర్యటించారు. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో డయేరియా ప్రబలిన గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిపిఎం బృందంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, కె.సుబ్బరావమ్మ, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌సి.హెచ్‌ శ్రీనివాసరావు, స్థానిక నాయకులు సిహెచ్‌.హనుమంతరావు, సోమోజు, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

 

➡️