అర్హులైన ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనప్పటి నుండి ఆటో డ్రైవర్లు, ఇతర కార్మికులు ఉపాధి కోల్పోయారు. దీంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆటో డ్రైవర్లు నిరసనలు వ్యక్తం చేశారు. కాగా నేడు ఆరు గ్యారంటీల పథకలకు సంభందించిన అప్లికేషన్‌ ను విడుదల చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆ క్యార్యక్రమంలో ఆటో డ్రైవర్ల సమస్యపై స్పందించారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటో డ్రైవర్లు నష్టాపోతారు అని ముందే అలోచించామని వారికి ఆర్ధిక సాయం చేస్తామని ముందుగానే మెనిఫేస్టో లో పోందుపర్చామని అన్నారు. అర్హులైన ఆటో డ్రైవర్లందరికి ఆర్దిక సాయం అందుతుందని అని సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

➡️