విశాఖలోని ఇండస్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

Dec 14,2023 12:09 #Fire Accident

ప్రజాశక్తి -విశాఖ : విశాఖపట్నం జగదాంబ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇండస్ హాస్పిటల్‎లో మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటల కారణంగా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదంలో పలువురు రోగులు చిక్కుకున్నారు. వీరిని మంటల్లో నుంచి బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఆసుపత్రి సిబ్బంది. బయటకు వచ్చిన వారిని వేరే ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి భారీగా వెలువడుతున్న పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని షాపులను అధికారులు మూసేశారు.

➡️